Oct 19,2023 07:18

ప్రజాశక్తి - పామర్రు : కృష్ణాజిల్లా పామర్రు మండలం కురుమద్దాలి గ్రామ పంచాయతీ సిపిఎం మాజీ సర్పంచ్‌ గుళ్లపల్లి నరసింహారావు (95) బుధవారం తుదిశ్వాస విడిచారు. వయోభారంతో గత కొంతకాలంగా ఆయన బాధపడుతున్నారు. 21 సంవత్సరాలపాటు కురు మద్దాలి గ్రామ సర్పంచ్‌గా ప్రజలకు సేవలందించారు. జైలు జీవితం కూడా అనుభవించారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య గతంలోనే మరణించారు. కుమారుడు జీవిరావు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్‌లో ప్రధాన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు కురుమద్దాలిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.