Sep 16,2023 14:43

ప్రజాశక్తి-పుట్లూరు : మండలంలోని బాలాపురం గ్రామంలో హిందూ స్మశాన వాటికి స్థలంలో కంప చెట్లను తొలగించాలని సిపిఎం ఆధ్వర్యంలో శనివారం బాలాపురం సచివాలయంలో వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాలాపురం గ్రామంలోని స్మశాన వాటికలో కంప చెట్లు అన్ని ఏపిగా పెరిగి కప్పబడిపోయింది. కావున చనిపోయిన వారిని దహన సంస్కారాలు చేసేందుకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించి స్మశాన వాటికలో ఉన్న కంప చెట్లను  తొలగించాలని కోరుచున్నాము. లేనిపక్షంలో గ్రామ సచివాలయం దగ్గర పెద్ద ఎత్తన బాలాపురం గ్రామ ప్రజలతో కలిసి సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలోమండల కార్యదర్శి సూరి రైతు సంఘం మండల కార్యదర్శి జి వెంకట చౌదరి మహిళా మండల కార్యదర్శిటీ రేణుక నాయకులు టీ పెద్దయ్య, భాస్కర్ రెడ్డి ,పృథ్వి, నాగభూషణం, గురుదేవ్ తదితరులు పాల్గొన్నారు.