Oct 16,2023 17:02

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇందన సర్దుబాటు పేరుతో పెంచిన కరెంటు చార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ సిపియం పార్టీ నగరకమిటి ఆధ్వర్యంలో విద్యుత్ భవనం ముందు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి.రాముడు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్న పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.రామాజనేయులు, పి.యస్.రాధాకృష్ణ , నగరకార్యదర్శి యం.రాజశేఖర్  మాట్లాడుతూ  నేను అధికారంలోకొస్తే కరెంటు చార్జీలు పెంచెను అని చెప్పిన వ్యక్తి, ""మాట తప్పను మడమ తిప్పను"" అని ప్రజలను మోసగించిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత అరుసార్లు కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై వందల కోట్ల రూపాయలు బారాలు వేశాడని వారు ఘాటుగా విమర్శించారు. ఇంధన సర్దుబాటు చార్జి పేరుతో 2014-15 నుండి 2018-19 సంవత్సరంలో యూనిట్ కి ఏడు పైసలు 18 నెలలపాటు వసూలు చేశాడని, 2020-21 సంవత్సరంలో వాడిన కరెంటుకు ఇంధన సర్దుబాటు చార్జి పేరుతో యూనిట్ కి 23 పైసలు చొప్పున పెంచాడని మళ్లీ ఈ సంవత్సరం ఏప్రిల్ మే జూన్ నెలలో వాడిన కరెంటుకు ఇంధనసర్దుబాటు చార్జి పేరుతో యూనిట్ కి 40 పైసలు చొప్పున  కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేయడం దుర్మార్గమైన చర్య అని వారు విమర్శించారు. ఒక వినియోగదారుడు కాల్చిన యూనిట్ చార్జీలు 125 రూపాయలు అయితే కష్టం చార్జీలు, మూడు సర్దుబాటు చార్జీలు కలిపి  395 రూపాయలు అవుతుందని మొత్తం బిల్లు 519 రూపాయలు అని, కాల్చిన కరెంటు రేటు కంటే ప్రభుత్వం అదనంగా వేసిన భారాలే మోయలేనంతగా ఉన్నదని వారు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు త్రిబుల్ షాక్ ఇచ్చిందని వారు విమర్శించారు. ఈ భారాల వల్ల కర్నూలు జిల్లాలో ప్రజానీకానికి 10 కోట్ల రూపాయలు భారం పడుతుందని వారు తెలిపారు. ప్రజలు సర్దుకుని చార్జీలను కట్టుకుంటూ పోతే రాబోయే కాలం కరెంటు బటన్ నొక్కడం కూడా చేతగాని పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుందని, అందుకోసం ప్రజలు  మేల్కోవాల్సిన సమయం  ఆసన్నమైందని వారు తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2022 లో తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలో భాగంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి తూచా తప్పకుండా మోడీ చెప్పిన విధానాన్ని అమలు చేస్తున్నాడని  విమర్శించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా కరెంటు చార్జీలు పెంచడానికి సుముఖత వ్యక్తం చేయని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం జగన్మోహన్ రెడ్డి కరెంటు చార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తున్నాడని, మళ్లీ ఇప్పుడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడం కొరకు రైతులను బలి పశువులు చేయడానికి పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని వారు ఘాటుగా విమర్శించారు ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని వారు రాష్ట్ర ప్రభుత్వాని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సి.గురుశేఖర్, సియచ్.సాయిబాబా, కె.సుధాకరప్ప, అర్.నరసిహులు, అబ్దుల్లా విజయ్, రామక్రీష్ణ, కె.ప్రభాకర్. క్రీష్ణ,బి.రాధాకృష్ణ , యేసు, జమ్మన్న, మూముద్, హుసేన్ , వలి, కుమార్, మురళి, చలపతి, బాస్కర్, శ్రీనివాసులు తదితరులు పాల్గోన్నారు