Mar 15,2023 16:35
  • జిల్లాలో 4 సర్వీస్ సెంటర్లు ఏర్పాటు - జిల్లా కలెక్టర్

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా ) : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు వాలంటీర్లకు సరఫరా చేసిన స్మార్ట్ ఫోన్లకు మరమ్మత్తులు చేపట్టనున్నామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముంగిట చేర్చుటకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు వాలంటీర్లకు స్మార్ట్ ఫోన్లను సరఫరా చేసిందని, అయితే మరమ్మత్తులకు నోచుకున్న మొబైల్స్కు ఈనెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం మరమ్మత్తు సేవా శిబిరాలను జిల్లాలో 4 చోట్ల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గుడివాడలో సెల్ఫీ టెక్నో సర్వీసెస్, మచిలీపట్నంలో లక్ష్మీ గణపతి కమ్యూనికేషన్స్, విజయవాడలో క్యూ డిజి సర్వీసెస్ లిమిటెడ్, అదేవిధంగా సుమన్ టెలీకాం వంటి సర్వీస్ సెంటర్లయందు ఈ మూడు రోజులు సేవా శిబిరములు నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమీషనర్లు వారి పరిధిలోని సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు ఈ విషయం తెలియజేశారు.