Mar 19,2023 17:04

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న లక్ష్యం నెరవేర్చేందుకు ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పధకం క్రింద పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ అందిస్తున్నదని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు.ఆదివారం ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యా దీవెన పధకం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా బటన్ నొక్కి ప్రారంభించారు. కలెక్టరేట్ నుండి ఈ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించిన అనంతరం విద్యార్ధులకు వారి తల్లులకు జగనన్న విద్యా దీవెన చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణాజిల్లా పరిధిలో డిగ్రీతో పాటు, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటిఐ వంటి వృత్తి విద్యాకోర్సులు చదువుతున్న 138 కళాశాలలకు చెందిన 33,946 మంది విద్యార్ధులు 29,865 మంది వారి తల్లులకు పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ క్రింద రూ.29.33 కోట్ల రూ.లు పంపిణీ గావించినట్లు తెలిపారు. ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి ఫణి ధూర్జటి, జిల్లా బిసి సంక్షేమ సాధికారత అధికారి ఎ.శ్రీనివాసరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కోఆర్డినేషన్ హరనాద్, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్ధులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.