- డిసిఎంఎస్ చైర్పర్సన్ సిహెచ్ శిరోమణి
ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : భూమి లేని దళితులకు స్థలం పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగ న్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైన దని, దళితుల పక్షపాతిగా మరోమారు రుజువు చేసుకున్నారని కర్నూలు డిసిఎంఎస్ చైర్పర్సన్ సిహెచ్ శిరోమణి అన్నారు. ఆమె మాట్లాడుతూ అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కు కల్పిస్తూ కేబినెట్లో తీసుకున్న నిర్ణయంతో దళితుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. గతంలో చంద్రబాబు మాయమాటలు చెప్పి మోసం చేశారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీని నమ్మే పరిస్థితుల్లో దళితులు లేరని స్పష్టం చేశారు. వలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు అమానుషమన్నారు.










