ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ క్లాప్ డ్రైవర్లు పెండింగ్ జీతాలు ఇవ్వాలని కోరుతూ సమ్మెలో భాగంగా 3వ.రోజు క్లాప్ ఆటోలను బంద్ చేసి సిఐటియు క్లాప్ ఆటో డ్రైవర్ల నాయకులు శ్రీను అధ్యక్షతన పున్నమి గెస్ట్ హౌస్ వెనకాల క్లాప్ ఆటోలు నిలబడు స్థలంలో క్లాప్ ఆటోల డ్రైవర్స్ ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు ఓల్డ్ సిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు అబ్దుల్ దేశాయ్,మారెళ్ల రామాంజనేయులు (విజయ) మాట్లాడుతూ కష్టపడి పని చేస్తున్నటు వంటి క్లాప్ డ్రైవర్లకు 3 నెలల నుండి 9 నెలల వరకు పెండింగ్ జీతాలు ఇవ్వవలసి ఉండగా ఒక జీతం ఇచ్చి రెడ్డి ఏజెన్సీ వారు పెండింగు జీతాలు పూర్తి ఇవ్వకుండా కార్మికుల కుటుంబాల జీవితాలతో ఆటలాడుతున్నారని విమర్శించారు,రెడ్డి ఏజెన్సీ వారు పెండింగ్ జీతాలు ఇవ్వకపోగా అలాగే ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం డ్రైవర్లకు ₹18,500/- ఈఎస్ఐ, పీఎఫ్,వీక్లీ ఆఫ్ లు, పని భద్రత కల్పించాలని ఉన్నవీటిని అమలు చేయకుండా 2 సంవత్సర కాలం నుండి క్లాప్ డ్రైవర్ల జీతంలో కట్ చేస్తున్నారు. కానీ వారి అకౌంట్లో వేయడం లేదని తెలిపారు, కార్మికులకు వీక్లీ ఆఫ్ అగ్రిమెంటులో ఇవ్వాలని ఉన్న ప్రభుత్వ సంస్థల లోనే అమలు చేయక పోవడం బాధాకరమన్నారు, అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వీటి కోసం ఉద్యమిస్తున్న కార్మికులపై రెడ్డి ఏజెన్సీ వారు పెండింగ్ జీతాలు అగ్రిమెంట్ అమలు చేయకపోగా పనిచేయాలని వేధిస్తున్నారు. మా కడుపులుకోట్టి వైసీపీ ప్రభుత్వ పెద్దలు వారు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పొట్టలు నింపుకుంటున్నారు,క్లాప్ ఆటో కార్మికులకు జీతాలు ఇప్పించకుండ వారి కుటుంబాలను ఉపవాసం ఉంచడం, వైసీపీ ప్రభుత్వానికి, మునిసిపల్ అధికారులకు మానవత్వం లేదని నిరూపించుకున్నారని వారు విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వ పెద్దలు, మున్సిపల్ కమీషనర్ జోక్యం చేసుకొని క్లాప్ డ్రైవర్స్ కార్మికుల పెండింగ్ జీతాలు ఇప్పించి వారి కుటుంబాలు ఆకలి బాధతో అలమటించకుండా ఆదుకోవాలని,క్లాప్ ఆటోలు బంద్ చేసి సమ్మె చేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లాప్ డ్రైవర్ లందరూ పాల్గొన్నారు.










