- పంచలింగాల చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ
ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్ర సరిహద్దు దగ్గర ఉన్న కర్నూలు జిల్లా, పంచలింగాల చెక్ పోస్టును జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆంధ్ర – తెలంగాణ బార్డర్ చెక్ పోస్టులలో ఓటర్ల ను ప్రభావితం చేసే నగదు, మద్యం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు, అనుమతులు లేకుండా సరఫరా చేసే ఇతర వస్తువులు అక్రమ రవాణా జరగకుండా గట్టి చర్యలు చేపట్టాలని, చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. జిల్లా ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ సిఐలు ప్రసాద్, శ్రీనివాస రెడ్డి, కర్నూలు తాలుకా సిఐ శ్రీరామ్, ఎస్సైలు, సెబ్ పోలీసులు ఉన్నారు.










