Sep 20,2023 16:18

ప్రజాశక్తి-రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలోని 29వ ఎన్నికల వార్డు రాజ విద్యాశ్రమం వద్ద సిమెంటు రోడ్డు నిర్మాణానికి బుధవారం పూజ జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం పురపాలక సంఘం అధ్యక్షులు పొరాలు శిల్ప, భూమి పూజ చేసి ప్రారంభించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సిమెంటు రోడ్డు నిర్మాణానికి 20 లక్షల రూపాయలు నిధులు మంజూరైనట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా చైర్పర్సన్ కాపు భారతి, రాయదుర్గం పురపాలక సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, వలి భాష, మాజీ అధ్యక్షులు గౌని ఉపేంద్ర రెడ్డి, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి,  వార్డు సభ్యులు గోవిందరాజులు, దేవరాజ్, గోవిందా, శ్రీనివాసరెడ్డి, లావణ్య, కో ఆప్షన్ సభ్యులు నజీర్, గుమ్మగట్ట జడ్పిటిసి సభ్యులు మహేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, గృహనిర్మాణ సంస్థ రాష్ట్ర డైరెక్టర్ శ్రీనివాసులు, వైకాపా నాయకులు వైజాగ్ రవి ,రిబ్కా, శివ, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.