ప్రజాశక్తి - ఆదోని
భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'చంద్రయాన్-3' దిగ్విజయం కావాలని బుధవారం పట్టణంలోని శ్రీచైతన్య-1, శ్రీచైతన్య-2 పాఠశాలలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హరికృష్ణ, గౌసియా ఖానమ్ మాట్లాడారు. ముందుగా చంద్రయాన్-3 ప్రయోగానికి కృషి చేసిన భారత శాస్త్రవేత్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చంద్రుడుపై కాలు మోపుతున్న చంద్రయాన్-3 కార్యక్రమాన్ని వీక్షించేందుకు కోట్లాదిమంది భారతీయులు ఎంతో ఆసక్తి, ఉత్కంఠతతో ఉన్నారని తెలిపారు. ఇస్రో ఛైర్మన్ సాయినాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముద్వేల్, విఎస్‌ఎస్‌సి డైరెక్టర్ ఉన్నికృష్ణ నాయర్, విఆర్‌ఎసి డైరెక్టర్ శంకర్ కృషితోనే చంద్రయాన్-3 ఉద్దేశం, చంద్రునిపై ఆక్సిజన్, నీటిని కనుగొనేందుకు చేస్తున్న అధ్యయనమని విద్యార్థులకు వివరించారు. ప్రతేడాది ఎన్‌ఎఎస్‌ఎ ప్రాజెక్టులను విద్యార్థులతో చేయించి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు వారికి పంపుతున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఎందరో విద్యావంతులు ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టుకు పంపిస్తున్నారని, అందులో శ్రీచైతన్య పాఠశాల నుంచి 75 శాతం ప్రాజెక్టులను ఎంపిక చేయబడతాయని చెప్పారు. ఎఒ అశోక్ కుమార్, అకాడమిక్ డీన్ వీరారెడ్డి, మహబూబ్ అలీ, విజయలక్ష్మి, మహేష్ పాల్గొన్నారు.
చంద్రయాన్-3పై శ్రీచైతన్య పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సిబ్బంది










