Oct 12,2023 19:46

ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్న దివాకర్‌రెడ్డి

ప్రజాశక్తి - పెద్దకడబూరు
టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టిడిపి ఇన్‌ఛార్జీ తిక్కారెడ్డి తనయుడు, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌ రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని గంగులపాడు గ్రామంలో క్లస్టర్‌ ఇన్‌ఛార్జీ, లీగల్‌ సెల్‌ అధ్యక్షులు బాబురావు ఆధ్వర్యంలో 'బాబుతో నేను' నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ, ఇంటింటికీ వెళ్లి అక్రమ కేసుల గురించి ప్రజలకు వివరించారు. పరిపాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విఫలమయ్యారని, టిడిపితోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని దివాకర్‌ రెడ్డి తెలిపారు. రాఘవేంద్ర స్వామి, శివ, ఆర్‌టిఎస్‌ కన్వీనర్‌ దశరథ రాముడు, అంజి పాల్గొన్నారు.