Oct 30,2023 21:31

దత్తాత్రేయస్వామి గుడి వద్ద టెంకాయలు కొడుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి -లింగసముద్రం : టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని మొగిలిచర్ల టిడిపి నాయకులు గ్రామంలోనే దత్తాత్రేయస్వామి ఆలయంలో 111 టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు. సోమవారం టిడిపి మండల అధ్యక్షులు వేముల గోపాలరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టిడిపి నాయకులు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిడిపి నాయకులు మక్కెన రమేష్‌,పల్లపోతు నరసింహం, అంగు లూరి చిన్న కొండయ్య,నవ్వులూరి చెంచురాములు,గంగాడి నరసింహం,పడిదపు గోపి,బాసం కొండలరావు,పల్లపోతు రత్తయ్య,పల్లపోతు నాగేశ్వరరావు,మలిశెట్టి శివ,మాల్యాద్రి,శ్రీను ఉన్నారు.