ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం
బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా జియమ్మవలస మండలం బొమ్మికలో టిడిపి నాయకులు ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి ఇంటింటికి వెళ్లి చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుపై వివరించారు. చంద్రబాబు నాయుడుకు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. 2024 ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పల్ల రాంబాబు, అరుకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎంపిపి బొంగు సురేష్, మండల తెలుగు రైతు అధ్యక్షులు బైరిపూడి సత్యంనాయుడు, గుమ్మలక్ష్మీపురం మండల కార్యదర్శి పోలూరి శ్రీనివాసరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీతంపేట: మండలంలోని జోగినాయుడుగూడ గ్రామంలో ఆదివారం బాబుతో నేను సైతం కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్లి చంద్రబాబునాయుడును అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించిన విధానాన్ని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు. బాబు ఈ రాష్ట్రానికి, యువత కోసం చేసిన మేలును తెలియజేస్తూ పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు సవరతోట మొఖలింగం, యూనిట్ ఇన్‌ఛార్జి బిడ్డిక స్వామినాయుడు, మండంగి కుమార్, సవర సోడంగి, గ్రామపెద్దలు, క్లస్టర్ ఇన్‌ఛార్జిలు, యూనిట్ ఇన్‌ఛార్జులు, పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్ : చంద్రబాబు పై పెట్టిన అక్రమ కేసులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నియోజకవర్గ టిడిపి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారి లో నిరసన శిబిరాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును జైలు పాలు చేయాలని ఉద్దేశంతో ఉన్నారన్నారు. ఆయనపై ఉన్న కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మాజీ ద్వారపురెడ్డి శ్రీదేవి, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు దొగ్గ మోహన్‌రావు, జి.రవికుమార్, సీనియర్ నాయకులు గొట్టాపు వెంకట నాయుడు, గర్భాపు ఉదయభాను, బార్నాల సీతారాం, కౌన్సిలర్లు టి.వెంకట్రావు, కె.నారాయణరావు, బి.గౌరినాయుడు, కోలా సరితా మధు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










