'బాబుతో మేము' కరపత్రాలు పంపిణీ చేస్తున్న టిడిపి కార్యకర్తలు
ప్రజాశక్తి-సిఎస్ పురం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు బుధవారం సిఎస్ పురంలో కరపత్రాలు పంపిణీ చేశారు. మండల పార్టీ అధ్యక్షులు బొమ్మనబోయిన వెంగయ్య ఆధ్వర్యంలో సిఎస్‌పురం గ్రామంలో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఏ తప్పు చేయకపోయినా అక్రమంగా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని, త్వరలో కడిగిన ముత్యంలా ఆయన బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు చేయడం చేతగానితనమని 'బాబుతో మేము' అంటూ కరపత్రాల ప్రచార కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎంసీ మాలకొండయ్య, మన్నేపల్లి శ్రీనివాసులు, దేవేండ్ల తిరుపతయ్య, బండారు వెంకటాద్రి, తోట చిన్న తదితరులు పాల్గొన్నారు.










