ప్రజాశక్తి - ఆస్పరి
చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని టిడిపి ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ తెలిపారు. బుధవారం మండలంలోని కైరుప్పల గ్రామంలో 'భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయంగా దర్శనమిస్తున్నాయని తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 2024 ఎన్నికల్లో సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపి చంద్రబాబు నాయుడును గెలిపించుకుందామని ప్రజలను కోరారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మండల కన్వీనర్ పరమారెడ్డి, సొసైటీ మాజీ డైరెక్టర్ కృష్ణ యాదవ్, ఎంపిటిసిలు నరసన్న, రహీంతుల్లా, టిడిపి నాయకులు వరప్రసాద్, రవి రెడ్డి, శేషి రెడ్డి, హనుమంతు రెడ్డి, మల్లికార్జున, గోవిందు, సుదర్శన్, బసవరాజు, మునిస్వామి, రాఘవేంద్ర, ఆచారి పాల్గొన్నారు.
మహిళలతో మాట్లాడుతున్న కోట్ల సుజాతమ్మ










