ఆటో డ్రైవర్లకు కరపత్రాలు అందిస్తున్న అశోక్
ప్రజాశక్తి- దేవనకొండ
రవాణా రంగ కార్మికుల హక్కులను, ప్రయోజనాలను కాపాడాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈనెల 6న చేపట్టే 'చలో విజయవాడ'ను జయప్రదం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి అశోక్ కోరారు. మంగళవారం దేవనకొండలో ఆటో కార్మికులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అసంఘటిత కార్మికులకు పిఎఫ్, ఈఎస్‌ఐ, టిడబ్ల్యు యాక్ట్ ప్రయోజనాల చట్ట పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఆటో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆటో కార్మికులు రంగయ్య, బ్రహ్మయ్య, నరేష్, రంగన్న, తిప్పన్న, గోపాల్ పాల్గొన్నారు.










