ప్రజాశక్తి-ఆలూరు
విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఎపి స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 7న నిర్వహించే 'చలో తిరుపతి' కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్షులు హెచ్.సత్యనారాయణ కోరారు. శనివారం ఆలూరు డిఎఇ కార్యాలయం ముందు గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగ కార్మికులకు 45 శాతం ఫిట్‌మెంట్‌తో పిఆర్‌సి ఇవ్వాలని కోరారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. గ్రేడ్-2 జెఎల్‌ఎంలను రెగ్యులర్ చేయాలని, పాదయాత్రలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాలని కోరారు. నాగేంద్రప్ప, కాళప్ప, బసవన్న గౌడ్, కెఎన్.బాబు, గని, గోపాల్, నాగరాజు, బషీర్ పాల్గొన్నారు. ఆదోని విద్యుత్ భవనం ముందు గోడపత్రికను విడుదల చేశారు. కమిటీ నాయకులు మల్లికార్జున, డివిజన్ కార్యదర్శి పవన్, పోల్ టు పోల్ రమేష్, సతీష్ ఉన్నారు.
ఆలూరులో గోడ పత్రికలను విడుదల చేస్తున్న నాయకులు










