ప్రజాశక్తి- శ్రీకాకుళం సిటీ : రైతులను దగా చేసే ప్రభుత్వ పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడాన్ని నిరసిస్తూ డిసెంబరు 2న చేపట్టనున్న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయాలని రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శులు నారాయణరావు కోరారు. నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. సందర్భంగా ప్రధాన కార్యదర్శులు జి.ఎ.నారాయణరావు, ఆదినాయణరావు, విజయనగరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి సతీష్ స్థల పరిశీలన, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను, రైతాంగ వ్యవస్థను పూర్తి నిర్వీరం చేయడానికి కొత్త చట్టాలను తయారు చేసిందన్నారు. అందుకు జిల్లా రైతు, కాంగ్రెస్ అభిమానులు, నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో సనపల అన్నాజీరావు, డి.గోవిందమల్లిబాబు, అంబటి కష్ణారావు, రెల్ల సురేష్, బైరి రాజేశ్వరరావు, దాలినాయడు పాల్గొన్నారు.










