ప్రజాశక్తి - కౌతాళం
ఆంధ్రప్రదేశ్ నూర్ బాష దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'చలో గుంటూరు'ను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు సాయిబాబా, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్షావలీ, నబీసాబ్ కోరారు. బుధవారం కౌతాళంలో గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా జనాభా ఉన్న దూదేకులకు మైనార్టీ పదవుల్లో వర్గీకరణ ధామాషా ప్రకారం దూదేకులకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఏ రాజకీయ పార్టీ నూర్ బాష దూదేకులకు చట్టసభల్లో అవకాశం కల్పిస్తుందో రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. తమ హక్కులను ఐక్యమత్యంతో పోరాడి సాధించుకోవాలని కోరారు. తమ పిల్లలను విద్యారంగంలో ప్రోత్సహించి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. దూదేకుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాబు సాబ్, ఆదోని తాలూకా అధ్యక్షులు మన్సూర్, సెక్రటరీ మాబు సాబ్, జిల్లా యూత్ నాయకులు టిప్పు సుల్తాన్, సంఘం నాయకులు అంగడి నబి సాబ్, దస్తగిరి, నబి సాబ్, రషీద్, పీర్ సాబ్, సిరాజ్, మరో 100 మంది పాల్గొన్నారు.
గోడపత్రికను విడుదల చేస్తున్న నాయకులు










