ప్రజాశక్తి-ఉయ్యూరు: రాష్ట్రంలో సర్పంచ్ల సమస్యలు ఢిల్లీ పెద్దలకు తెలియజేసి పరిష్కారం కోరేందుకు ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ సంఘం ఆధ్వర్యలో తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి ఆకునూరు సర్పంచ్, ఉమ్మడి కష్ణాజిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గోలి వసం తకుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్లు మంగళవారం గన్నవరం విమానాశ్రయం నుండి తరలివెళ్లారు. పంచాయతీల నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి దొంగిలించ డంపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసే దిశగా పంచాయతీరాజ్ చాంబర్ వ్యవస్థాపక అధ్య కుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టి తరలి వెళుతున్న ట్టు వసంతకుమార్ తెలిపారు. సంఘం అధికార ప్రతినిధి తిమోతి, ప్రధానకార్యదర్శి కాగిత గోపాలరావు, మండలి ఉదయ్భాస్కర్, ఎం. రవిప్రసాద్, పి.సురేశ్, కొప్పుల సీతారామయ్య ఢిల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు.










