వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్న శాస్త్రవేత్తలు
ప్రజాశక్తి-దర్శి: చిరుధాన్యాలతో ఆహారం తయారీలో మెలకువలు నేర్చుకుని మహిళలు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండాలని గృహవిజ్ఞాన శాస్త్రవేత్త మానస అన్నారు. చిరుధాన్యాలపై కృషి విజ్ఞాన కేంద్రంలో ఆమె మహిళలకు పోషక విలువలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త ఎం ఉష, రిలయన్స్ ఫౌండేషన్ విశ్వేశ్వరరెడ్డి, గ్లోరి, మహిళలు పాల్గొన్నారు.










