పుట్టపర్తి రూరల్: చిరుధాన్యాల సాగుతో ఎంతో ప్రయోజనంగా ఉందని జిల్లా వ్యవసాయ సలహామండలి అధ్యక్షులు అవుటాల రమణారెడ్డి అన్నారు. పుట్టపర్తి మండల వ్యవసాయ కార్యాలయం లో మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు ఆవుటాల రమణారెడ్డి,మండల అగ్రి అడ్వైజర్ బోర్డ్ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి, మండల స్థాయి అధికారులు,గ్రామస్థాయి అగ్రి అడ్వైజర్ బోర్డ్ మెంబర్లు, ఆర్‌బికె సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో రమణారెడ్డి మాట్లాడుతూ రైతులకు చిరుధాన్యాలపై ఆసక్తి కలిగేలా అవగాహన కల్పించాలని చెప్పారు. చిరుధాన్య పంటలకు పెట్టుబడి ఖర్చు తక్కువని,పంటదిగుబడి ఎక్కువ ఫలితంగా రైతుకు అదనపు ఆదాయం చేకూరుతుందని, ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండల శాఖల అధికారులు, రైతు భరోసా సిబ్బంది పాల్గొన్నారు.










