Jul 14,2023 19:17

ఎస్‌ఐ రమేష్‌ బాబును సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - చిప్పగిరి
చిప్పగిరి ఎస్‌ఐగా కర్నూలు విఆర్‌ నుంచి వచ్చిన రమేష్‌బాబు శుక్రవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ మల్లికార్జున బదిలీల్లో భాగంగా బండి ఆత్మకూరుకు వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ రమేష్‌ బాబు మాట్లాడుతూ... శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూసుకుంటామన్నారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలను ఎవరు ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యలపై స్టేషన్‌కు వచ్చే వారికి పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానన్నారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్‌ఐని కలిసిన నాయకులు
బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ రమేష్‌ బాబును చిప్పగిరి సర్పంచి గోవిందరాజులు, వైసిపి సీనియర్‌ నాయకులు ధర్మేంద్ర, పంచాయతీ కార్యదర్శి నాగభూషణం మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల, శాలువాతో సన్మానించారు. మహేష్‌ బాబు పాల్గొన్నారు.