చింతలపాడు మృతులకు పరిహారం మంజూరు
ఎమ్మెల్యే రమేష్ బాబు
ప్రజాశక్తి-అవనిగడ్డ
గతేడాది చల్లపల్లి శివారు కాసానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన, గాయపడిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం మంజూరైనట్లు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చెప్పారు. గురువారం వైసిపి కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాసా నగరం వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన ఐదుగురు చింతలమడ వాసులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, ప్రమాదంలో గాయపడిన 16 మందికి ఒక్కొక్కరికి రూ.50 వేలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాద మృతులకు ఎక్కడా పరిహారం ఇవ్వడం లేదనీ, అడిగిన వెంటనే అంగీకరించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి క్షతగాత్రులకు సకాలంలో వైద్య సేవలు అందించడంతోపాటు మృతదేహాలకు పోస్టుమార్టం త్వరితగతిన నిర్వహించేలా చూశామన్నారు మరణించిన వారికి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి రూ.10 వేలు సహాయం చేశామన్నారు. పరిహారం ఇవ్వాలని గతంలోనే జిల్లా కలెక్టర్ ద్వారా సీఎంకు లేఖ రాశామన్నారు. ఈ ఈ విషయాలన్నీ తెలిసి దీనిపై మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ దీక్షలంటూ రాజకీయాలు చేశారని ఎమ్మెల్యే విమర్శించారు.
రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం
రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని ఇటీవల సిఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి నివేదించగా వెంటనే కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రమేష్ బాబు చెప్పారు. గతంలో నిలిచిపోయిన కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించినట్టు చెప్పారు మోపిదేవి మండలంలో ధాన్యం కొనడం లేదని కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని తడిసి రంగు మారిన ధాన్యమును ఆరిన తర్వాత తీసుకోవాలని ఆర్బికే సిబ్బందికి చెప్పగా ధాన్యం కొనడం లేదని టిడిపి నేతలు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. మొత్తం కొనుగోలు చేస్తామని ఎక్కడన్నా సమస్యలు తలెత్తితే వెంటనే తనకు ఫోన్ చేస్తే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ ఈ సమావేశంలో ఏపీ రైతు విభాగం జోనల్ ఇంచార్జ్ కడవకొల్లు నరసింహారావు సర్పంచ్ గరికపాటి వెంకటేశ్వరరావు ఏపీ వ్యవసాయ మిషన్ మండల కన్వీనర్ మతి వెంకట సత్యనారాయణ మాజీ సర్పంచ్ సైతం బాబురావు తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు










