Oct 03,2023 22:37

మృతి చెందిన పైడయ్య

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : మండలంలోని పెదబొండపల్లికి చెందిన సవరపు పైడియ్య (64) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన తామర చెరువులో స్నానానికి దిగి చనిపోయినట్లు స్ధానికులు తెలిపారు. మంగళవారం ఉదయం చెరువులో తేలిన శవం కలకలం సృష్టించగా, గ్రామస్థుల ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు వెలికితీశారు. పైడియ్యగా గుర్తించారు. మృతునికి భార్య, ముగ్గరు కుమార్తెలు ఉన్నారు. రూరల్‌ ఎస్‌.సింహాచలం కేసు దర్యాప్తు చేస్తున్నారు.