May 31,2023 22:33

పుస్తకావిష్కరణ చేస్తున్న ప్రముఖులు

ప్రజాశక్తి - చిలమత్తూరు : మండల పరిధిలోని హుస్సేన్‌పురం గ్రామానికి చెందిన యువకవి, శ్రీ కళావేదిక రాష్ట్ర యువజన అధ్యక్షులు,పలు ప్రపంచ రికార్డులు, అవార్డుల గ్రహీత వడ్డి సుధాకర్‌ రాసిన చెమటచుక్క పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించారు. కవి, ఉపాధ్యాయుడు రాయపాటీ శివయ్య చేతుల మీదుగా ఈపుస్తకాన్ని చిలమత్తూరులో బుధవారం ఆవిష్కరించారు. పలు సామాజిక అంశాలపై కవిత్వాన్ని రాసి ,పేదల పక్షాన నిలిచిన కవిగా వడ్డి సుధాకర్‌ నిలిచారని వారు కొనియాడారు. శ్రమజీవుల జీవన విధానాన్ని ఒడిదడుకులను కన్నీరు తెప్పించే యదార్థాలను ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వర్ణించారని కొనియాడారు. ఈ ఈ కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయులు శివకుమార్‌, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రామకృష్ణ, అలీముల్లా, శ్రీనివాసులు, లక్ష్మీపతి, సురేష్‌ కుమార్‌, పోలీస్‌ సిబ్బంది విజరు కుమార్‌ నాయక్‌ , స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.