Sep 08,2023 20:00

మాట్లాడుతున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్‌
చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. శుక్రవారం బనవాసిలోని జవహర్‌ నవోదయ విద్యాలయం ఆధ్వర్యంలో ప్రతేడాది నిర్వహించే 'పేస్‌ సెట్టింగ్‌' కార్యక్రమంలో భాగంగా విద్యాలయ సమీపంలోని హనుమాపురం ఎంపియుపి పాఠశాలలో 'హ్యాండ్‌ వాష్‌' కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యం, పరిశుభ్రత, చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. జవహర్‌ నవోదయ విద్యాలయ ఇన్‌ఛార్జీ ప్రిన్సిపల్‌ కె.చందిరన్‌, ఉపాధ్యాయులు బసవరాజ్‌, మీనా చంద్రన్‌, ఎం.వెంకటేష్‌, సోనమ్‌ కుమారి, యోగేష్‌, చాంద్‌, ఎంపియుపి స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు జి.సత్య కరుణ పాల్గొన్నారు.