Oct 10,2023 21:02

   ఏలూరు టౌన్‌ :వ్యాపారులు రోడ్లపై చెత్తాచెదారం వేయకుండా పారిశుధ్య సిబ్బందికి సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. మంగళవారం ఉదయం వన్‌ టౌన్‌ ప్రాంతంలోని చేపల మార్కెట్‌లో సుడిగాలి పర్యటన చేపట్టి మార్కెట్‌ ప్రాంతంలోని అన్ని షాపులను పరిశీలించారు. అక్కడ వ్యాపారులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్‌ ప్రాంతంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో డిఇ పిలగల కొండలరావు కమిషనర్‌ వెంట ఉన్నారు.