Jun 23,2023 21:57

చెరువును పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి - చిలమత్తూరు : స్థానిక తుమ్మలకుంట చెరువును అధికారులు సందర్శించారు. తుమ్మల కుంటలో చేపలు మృతి అనే శీర్షిక ఈ నెల 22న ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మత్స్యశాఖ అధికారి శంకర్‌, కార్యదర్శి నాగరాజు, ఇంజనీర్‌ గోవర్థన్‌ చేపల చెరువును పరిశీలించారు. చెరువులో చేపలు మృతిచెందడానికి కారణాలను తెలుసుకున్నారు. నీటిలో ఆక్సిజన్‌ శాతం తగ్గడంతోనే చేపలు మృతిచెందాయని తేల్చారు. కేవలం జిలేబీ జాతికి చెందిన చేపలే మృతి చెందాయని ఇందుకు కారణం ఆ చేపలకు తగిన ఆక్సిజన్‌ అందకపోవడమే కారణమని అన్నారు. పసుపు, ఉప్పు, సున్నంను నీటిలో చల్లి నీటిని కదిలిస్తే వాటికి ఆక్సిజన్‌ అందుతుందని అన్నారు. నీటిని నమూనాని పరీక్షల నిమిత్తం హిందూపురం ఆర్డబ్యూఎస్‌ కార్యాలయానికి పంపించారు.