మగ్గం పరికరాలను అందజేస్తున్న దృశ్యం
ధర్మవరం టౌన్ : పట్టణంలోని శాంతినగర్లో ఎస్సీ చేనేత కార్మికులకు మగ్గం పరికరాలను చేనేత జౌళిశాఖ సత్యసాయిజిల్లా ఏడీ రమేష్ గురువారం పంపిణీచేశారు. జాతీయ చేనేత అభివృద్ధి పథకంలోని హెచ్‌ఎస్‌ఎస్ ఆంశంకింద 48 మంది ఎస్సీ చేనేత కార్మికులకు మోటారు లిస్టింగ్ మిషన్లు, 6 మగ్గాలను పంపిణీచేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మీ, నాయకులు చెలిమి పెద్దన్న, జింక కంబగిరి తదితరులు పాల్గొన్నారు.










