ప్రజాశక్తి - సీతంపేట : అందరూ చదువు కోవాలి అంటున్న పాలకులు అందు బాటులో పాఠశాల లను ఉంచడంలేదు. దీంతో చదువు కోడానికి గిరిజన చిన్నారులు రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తూ నానా అవస్థలు పడుతు న్నారు. అందరికీ అందుబాటులో విద్య, ప్రతి గ్రామానికి కార్పొరేట్ తరహాలో పాఠశాల అంటూ పాలకులు, అధికారులు ఊకదంపుడు ఉప న్యాసాలకు కొదవ లేదు. ఇందుకు నిదర్శనం మండలం లోని పూతికవలస. ఈ పంచాయతీలో పాఠశాల అందుబాటులో లేకపోవడంతో బంజరు గూడ, నడిమిగూడ, రాజీగాడి గూడ గ్రామాలకు చెందిన చిన్నారులు రెండుకిలోమీటర్ల దూరానున్న చింతమాను కాలనీకి నడుకుంటూ వెళ్తున్నారు. 25మంది గిరిజన విద్యార్థులు సుమారు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. దీంతో మార్గ మధ్యలో చిన్నారులు ఎటువంటి ప్రమాదాులకు గురౌతారోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో అయితే పిల్లలు ఇంటికి వచ్చే వరకూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వారి కోసం ఎదురు చూస్తున్నామని వాపోయారు. తక్షణమే పూతికవలసలో పాఠశాల ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు ఎం.తిరుపతిరావు డిమాండ్ చేశారు. పాఠశాల ఏర్పాటు చేయకపోవడంతో భవిష్యత్తులో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.










