Jul 30,2023 15:48

ప్రజాశక్తి-చిప్పగిరి : మండల పరిధిలోని కుందన గుర్తి గ్రామంలో ఎస్సీల స్మశాన వాటికకు పోవు రహదారి అంతా కూడా ములకంప చెట్లతో నిండియున్నది. ఎస్సీ కాలనీవాసులు గుండాల లక్ష్మన్న, లాలెప్ప, పెన్నయ్య, నారాయణ, కుషేంద్ర, రామాంజనేయులు విజ్ఞప్తి మేరకు ఆదివారం సర్పంచ్ కొండ పురుషోత్తం ఆధ్వర్యంలో జెసిబి ద్వారా రహదారికి అడ్డంగా ఉన్న ముళ్ళకంప చెట్లన్నీ కూడా తొలగింపు కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ మాట్లాడుతూ ఎస్సీల స్మశాన వాటికకు ఎవరైనా చనిపోయినప్పుడు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ముఖ్యంగా ఎస్సీల స్మశాన వాటికకు కాలినడకన పోవడానికి కూడా ఇబ్బందులు పడుతుండడంతో వెంటనే స్పందించి పనులను చేయించాను అన్నారు. గ్రామాభివృద్ధి కొరకు తన వంతు కృషి ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. సర్పంచుకు ఎస్సీ కాలనీవాసులు అంత కూడా కృతజ్ఞతలు తెలిపారు. హేమాంజనేయులు, శ్రీనివాసులు, కొండ నెట్టెప్ప, గంగాధర్, పాల్గొన్నారు.