Jun 15,2023 16:20

ప్రజాశక్తి-చల్లపల్లి : కాకినాడ జేఎన్టీయూ పరిధిలో 2021- బిటెక్ ఈసీఈ విభాగంలో ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచి బంగారు పతకం పొందిన చల్లపల్లి మండలం రామానగరంకు చెందిన కోనేరు గ్రీష్మను మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అభినందించారు. గురువారం రామానగరంలోని గ్రీష్మ స్వగృహానికి వెళ్లిన ఆయన గ్రీష్మను అభినందించి దుస్సాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థిని తల్లిదండ్రులు కోనేరు శ్రీనివాసరావు-శారద దంపతులను బుద్ధప్రసాద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్(రాజా), ఎంపీటీసీ మాలెంపాటి శ్రీనివాసరావు, చల్లపల్లి ఉప సర్పంచ్ ముమ్మనేని నాని, టీడీపీ నేత గొరిపర్తి సుబ్బారావు, కోనేరు బలరాం పాల్గొన్నారు.