ప్రజాశక్తి-పుట్లూరు : ఈ బ్రిడ్జిపై వెళ్లేటప్పుడు రహదారులు ఏమాత్రం ఆదమరిచిన మృత్యువాత పడాల్సిందే, పుట్లూరు మండల కేంద్రంలోని హెచ్ ఎల్ సి.కాలపై ఏర్పాటు చేసిన రెండు బిడ్జిలకు ఇరువైపులా ఉన్న సైడ్ వాళ్లు కూలిపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ బ్రిడ్జిలపై ప్రయాణించాలంటే వాహన శోధకులు బెంబేలెత్తుతున్నారు. గతంలో నాయకుని పల్లె వెళ్లే రహదారిలో ఏర్పాటు చేసిన బ్రిడ్జి పై వెలుతు ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందారు ఇంకో ఇంకో బ్రిడ్జి పైన కూడా కస్తూర్బా బాలికల పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా ఆదర్శ పాఠశా వెళ్లే వెళ్లే విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ఈ బ్రిడ్జి మీదుగానే వెళ్లాలి ఈ బ్రిడ్జి మీదుగా వెళ్లాలంటే ప్రయాణికులు విద్యార్థులు భయపడుతున్నారు. ఈ బ్రిడ్జికి సైతం సైడ్ వాళ్ళు లేకపోవడంతో గతంలో కాలువలేకి ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు పడినాయి దీంతో ఆస్తి నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం జరగలేదు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలపై ఏర్పాటు చేసిన బ్రిడ్జికి ఇరువైపులా సైడ్ వాళ్ళు ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.










