Sep 30,2023 15:02

ప్రజాశక్తి-పుట్లూరు : వైద్యం కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడకుండా వైద్యరంగంలో అనేక మార్పులు తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో మారు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నట్లు శింగనమల మార్కెట్ యార్డ్ చైర్మన్ భూమిరెడ్డి సునీతమ్మ తెలిపారు. శనివారం మండలంలోని తక్కల్లపల్లి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒక రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు మందులను ఉచితంగా అందిస్తారు. ఇప్పటికే నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మార్చిన ప్రభుత్వం, ఫ్యామిలీ డాక్టర్, వైయస్సార్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మేలు చేకూర్చుతోందన్నారు. ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం నిత్యం పనిచేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాండ్లపాడు సర్పంచ్ భారతి, తాసిల్దార్ మోహన్ కుమార్, ఎంపీడీవో యోగానంద రెడ్డి, డాక్టర్ శ్రీవాణి, ఈఓఆర్ డి ఆనంద్ ప్రసాద్, వైద్య సిబ్బంది సచివాల సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.