ప్రజాశక్తి - బలిజిపేట : మండలం లోని మిర్తివలసలో గల డాక్టర్ శంబంగి శ్రీనివాసరావు మామిడితోటలో ఎపిసిఎన్‌సి వారిచే ఏర్పాటు చేసిన బయో ఇన్పుట్ సెంటర్‌ను ఎఒ శ్రావణ్‌కుమార్ సోమ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా100 లీటర్ల అగ్నిస్త్రం, 200 లీటర్ల నీమాస్త్రం, 4వేల లీటర్ల ద్రవ జీవామృతం తయారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎఒ మాట్లాడుతూ ఎన్‌పిఎం, మరియు బయో ఇన్పుట్ సెంటర్ల సేవలను చిన్న, సన్నకారు రైతులు వినియోగించుకొని వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను తగ్గించుకొని అధిక దిగుబడులను పొందాలన్నారు. అలాగే ఆరోగ్యాలను కాపాడుకోవాలని వివరించారు. బయో ఇన్పుట్ సెంటర్లో లభించిన దశపర్ణిక, అగ్నిఅస్త్రం, బ్రహ్మాస్త్రం, మీనామృతం, ఎగ్ ఏమి నో యాసిడ్, పంచగవ్య, పుల్లటి మజ్జిగ, జీవామృతాలను రైతులు వినియోగించుకుంటారని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎపిసిఎన్‌ఎఫ్ సిబ్బంది మానస, శారద, లక్ష్మీ, దేవీప్రసాద్, తిరుపతిరావుతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ఎన్‌ఎఫ్ రైతులు పాల్గొన్నారు.










