ప్రజాశక్తి - ఆదోని
రైతులతో పాటు ఇతరులకు కూడా రుణాలు అందిస్తూ బ్యాంకు సేవలను విస్తరించాలని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని ఎస్‌కెడి కాలనీ ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాలు పక్కన కెడిసిసి బ్యాంకు నూతన భవనాన్ని ప్రారంభించారు. రూ.85 లక్షలతో నిర్మించిన బ్యాంకు భవనాన్ని కెడిసిసి బ్యాంకు జిల్లా అధ్యక్షులు ఎస్వీ.విజయ మనోహరి, ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆదోనిలో జిల్లా సహకార బ్యాంకు రావడం, నూతన భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం తరఫున రైతు భరోసా, పంట నష్ట పరిహారం, రైతులకు సున్నా వడ్డీ, రైతులకు వైఎస్‌ఆర్ యంత్ర సేవకు సంబంధించి సబ్సిడీ రుణాలు, రైతు కిసాన్ మరెన్నో పథకాల ద్వారా ఈ బ్యాంకులో లబ్ధి పొందేందుకు అవకాశం ఉందని తెలిపారు. 2024లో కచ్చితంగా జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడం రాష్ట్ర ప్రజల తథ్యమన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మున్సిపల్ ఛైర్మన్ బోయ శాంత, సిఇఒ రామాంజనేయులు, వార్డు కౌన్సిలర్ రాజేశ్వర్ రెడ్డి, మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ కామాక్షి తిమ్మప్ప, వైసిపి పట్టణ గౌరవాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, ప్రతాపరెడ్డి, బ్యాంకు మేనేజర్ నాగరాజు, ఇక్బాల్, ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల అన్ను భారు పాల్గొన్నారు.
కెడిసిసి బ్యాంకు నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే










