Aug 27,2023 21:10

పార్టీలో చేరిన యువతకు కండవా వేస్తున్న జనసేన నాయకులు అక్కివరపు

ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : జనసేన ఆవిర్భావ సందర్భంగా వారోత్సవాలను మండలంలోని బుదురువాడలో జనసేన నాయకులు అక్కివరపు మోహన్‌ రావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన అధికారంలోకి వస్తే అవినీతి లేని పాలన, మహిళలకు రక్షణ, నిరుద్యోగులకు ఉద్యోగాలు వంటివి కల్పించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తారన్నారు. ఇప్పటికే జనసేన విధి విధానాలకు ఆకర్షితులై అనేక గ్రామాల్లో చేరికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మోహనరావు, జనసేన మండల అధ్యక్షులు ఆగూరు మణి, రాష్ట్ర ఐటీ వింగ్‌ సభ్యులు గేదెల సతీష్‌ సమక్షంలో బుదురువాడలో 50 కుటుంబాలు జనసేనలో చేరాయి. కార్యక్రమంలో రాజన బాలు, బొనేల గోవిందమ్మ, ఖాతా విశ్వేశ్వరావు, గుంట్రెడ్డి గౌరీశంకర్‌, అల్లు రమేష్‌, గొలగాన సత్యనారాయణ, కర్రి మణికంఠ, చిట్లి గణేశ్వరరావు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్‌, అంబటి బలరాం, కనకరాజు, పైల రాజు, దుర్గా ప్రసాద్‌, చంద్రశేఖర్‌, కృప తదితరులు పాల్గొన్నారు.