ప్రజాశక్తి-అవనిగడ్డ : పులిగడ్డ ఆక్విడెక్ట్ పరిరక్షణ పేరుతో బుద్ధ ప్రసాద్ నిర్వహిస్తున్న దొంగ దీక్షలను ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. శుక్రవారం పులిగడ్డ ఆక్విడెక్టు వద్ద మాజీ సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ రైతు సామూహిక సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. దీనిపై ఎమ్మెల్యే రమేష్ బాబు స్పందిస్తూ శనివారం పార్టీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏదైనా మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడల్లా పొలం బాట దీక్షలు చేయడం బుద్ధ ప్రసాద్ కి అలవాటే అన్నారు. వాళ్లు బంధించిన 22 ఏ భూములకు మోక్షం కల్పించామని, కరోనా సమయంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు మనోధైర్యం చెప్పామని ఆ సమయంలో బుద్ధ ప్రసాద్ ఎక్కడున్నా రో చెప్పాలన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజల మధ్య ఉంటున్నట్టు భ్రమలు కల్పిస్తున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ప్రజల దష్టిని మలచేందుకు చీఫ్ ట్రిక్కులు చేయడం బుద్ధ ప్రసాద్కు అలవాటే అన్నారు. త్వరలోనే మరో రెండు దొంగ దీక్షలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎదురు మొండి బ్రిడ్జి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని, అదే విధంగా అవనిగడ్డ కోడూరు రహదారి నిర్మాణానికి కూడా త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఇందుకు దీక్షలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సమస్యలుంటే సత్యాగ్రహ దీక్షకు రైతులెందుకు కరువయ్యారో చెప్పాలన్నారు. 20 ఏళ్ల పాలనలో బుద్ధ ప్రసాద్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని వాళ్ళ అనుచరులు మాత్రం మా నాయకుడు చేసిన పనులు చెప్పాలంటే పేజీలు సరిపోవు అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టిడిపిలో జిల్లా నాయకుడిగా ఎదిగిన అంబటి బ్రాహ్మణయ్య పేరుని ఉల్లిపాలెం వారధికి పెట్టకుండా అడ్డుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న కష్ణా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల రైతు విభాగం జోనల్ ఇంచార్జ్ కడవకొల్లు నరసింహారావు మాట్లాడుతూ పులిచింతల ప్రాజెక్టుకు అవనిగడ్డలో అంకురార్పణ జరిగిందని బుద్ధ ప్రసాద్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగ్గయ్యపేట కు చెందిన వాసిరెడ్డి వంశీయులు ముత్యాలరాజు బ్రిటిష్ వారి కాలం నుంచి పోరాడితే ఏర్పడిన ప్రాజెక్టు పులిచింతల అన్నార. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ, సర్పంచ్ గో రుముచ్చు ఉమా, పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, మండల పార్టీ కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గుర్రం బసవయ్య, లంకమ్మ, అమ్మవారి టెంపుల్ చైర్మన్ అన్నపురెడ్డి రామదాసు, గ్రామ మాజీ ఉపసర్పంచ్ గాజుల జయ గోపాల్, మాజీ సర్పంచ్ నలుకుర్తి పధ్వి రాజు తదితరులు పాల్గొన్నారు










