కరపత్రాలను విడుదల చేస్తున్న ఐద్వా నాయకులు, తదితరులు
ప్రజాశక్తి - కదిరి టౌన్ : దేశంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలు హింసలపై పోరుకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అధ్వర్యంలో హింసపై మహిళల పోరు యాత్ర పేరుతో చేపట్టిన రాష్ట్ర బస్సుయాత్రను విజయవంతం చేయాలని కోరారు. బస్సుయాత్ర ఈ నెల 28న కదిరికి వస్తున్న నేపథ్యంలో ఈ యాత్రకు సంబందించిన కరపత్రాలను మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు శాంతిభాయి, ఆదిలక్ష్మి, సుశీల, నాగమణి, రత్నమ్మ, నారాయణమ్మ, హేమావతి, సిఐటియు నాయకులు జగన్మోహన్, రామ్మోహన్, ఆంజనేయులు, గంగులప్ప తదితరులు పాల్గొన్నారు.










