Aug 22,2023 19:50

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చేసే విధంగా ఈనెల 17 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే సిపిఐ ప్రచార జాత, బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.అజరు బాబు, సిపిఐ పట్టణ మండల కార్యదర్శి సుదర్శన్‌, కల్లుబావి రాజు కోరారు. మంగళవారం ఆదోనిలోని సిపిఐ కార్యాలయంలో యాత్ర గోడపత్రికను విడుదల చేశారు. సెప్టెంబర్‌ 1, 2న కర్నూలు, కోడుమూరు, ఆలూరు, పత్తికొండలో బస్సు యాత్ర, భారీ బహిరంగ సభలో సంఘాల నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.