మృతిచెందిన ప్రమీల(ఫైల్)
ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : మండలంలోని రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న హిమరిక ప్రమీల బ్రెయిన్ కేన్సర్‌తో మృతి చెందింది. విద్యార్థిని ప్రమీలను వైద్యం కోసం 15 రోజుల కిందట విశాఖ కెజిహెచ్‌కు తరలించి వైద్యసేవలు అందించారు. వ్యాధి ముదరడంతో చికిత్స పొందుతూ మరణించినట్లు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు తెలిపారు. విద్యార్థిని స్వగ్రామం కొమరాడ మండలం గాజులగూడ. విద్యార్థిని మరణవార్త తెలుసుకున్న పాఠశాల హెచ్‌ఎం సుగుణకుమారి, వార్డెన్ జోగిలత, ఉపాధ్యాయులు గ్రామానికి వెళ్లి విద్యార్థిని తల్లిదండ్రులను ఓదార్చారు.










