Oct 15,2023 23:52

నీటి సరఫరాను ప్రారంభిస్తున్న జడ్‌పిటిసి

ప్రజాశక్తి -కనిగిరి : కనిగిరి మండలం ఏరువారిపల్లి పంచాయతీ పరిధిలోని అజీస్‌పురంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఈ సమస్య గురించి గ్రామ సర్పంచి దమ్ము వెంకటయ్య జడ్‌పిటిసి మడతల కస్తూరి రెడ్డి దష్టికి తీసుకెళ్లారు. స్పందించిన జడ్‌పిటిసి జడ్‌పినుంచి రూ.5 లక్షలు నిధులు మంజూరు చేయించారు. ఆ నిధులలో బోరు, పైపులైన్‌ నిర్మాణం చేపట్టి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన జడ్‌పిటిసికి గ్రామసర్పంచి, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి దమ్ము వెంకటయ్య, వైసిపి నాయకులు వీరం రెడ్డి బ్రహ్మారెడ్డి,మేడం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.