బంగారు రంగుతో ఉన్న తాబేలు
మడకశిర : మండల పరిధిలోని కళ్లుమర్రి చెరువులో బంగారు రంగు గల తాబేలు లభ్యమయింది. శనివారం నాడు చెరువు నుంచి బయటకు వచ్చిన తాబేలును చూసిన గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. బంగారు రంగు గల తాబేలును చూడటానికి పలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చెరువుకు వద్దకు వచ్చారు. తరువాత అది చెరువులోకి వెళ్లిపోయింది. ఈ రంగు గల తాబేళ్లు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండవని, ఎక్కడి నుంచి ఇది వచ్చి ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.










