బెంగుళూరు నుండి ప్రత్యేక వాహనంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుటుం సభ్యుల మృతదేహాలు స్వగ్రామానికి తరలింపు
ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్ : బెంగుళూరులో అనుమానాస్పద స్థితిలో మరణించిన నలుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలను శనివారం మచిలీపట్నం మండలం బందరుకోట గ్రామానికి తీసుకువచ్చారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి మతదేహాలను కుటుంబ సభ్యులు బెంగుళూరు నుండి ప్రత్యేక వాహనంలో వారి స్వగ్రామమైన బందరుకోటకు తరలించారు. ఒక్కసారిగా నలుగురినీ విగత జీవులుగా చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో బందరు కోట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. బందరుకోటకు చెందిన గుండు వీరాంజనేయ వినరు (కన్నా) (33)కు మోపిదేవి మండలం మెరకపల్లి గ్రామానికి చెందిన హైమావతి (29)తో 2018లో వివాహమైంది. వీరికి మోక్ష (2), మేఘన (8 నెలలు) ఉన్నారు. వినరు మూడు నెలలుగా భార్య హైమావతి, ఇద్దరు చిన్నారులతో కలిసి బెంగుళూరులోని సింగనహళ్లిలోని ఓ అపార్టుమెంటులో అద్దెకు నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే రెండు రోజులపాటు మెసేజ్‌లు పెట్టినా, ఫోన్లు చేసినా ఎలాంటి స్పందన రాకపోవటంతో అనుమానం వచ్చిన హైమావతి తల్లిదండ్రులు బెంగుళూరు వెళ్లారు. ంట్లో విగతజీవులుగా పడివున్న నలుగురిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అపార్ట్‌మెంట్ పరిధిలోని కాడుగోడి పోలీసుస్టేషనుకు సమాచారం అందించారు. భార్యాభర్తలు చిన్నారులతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారా లేక చిన్నారులను చంపి ఆ తరువాత భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్నారా, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థల కారణంగా భార్యను, పిల్లలను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయని బంధువులు చెబుతున్నారు. బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










