బండి రామకృష్ణ ఆర్థిక సహాయం
ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్
మచిలీపట్నం 22వ డివిజన్ యానాదుల కాలనీ చెందిన వీరబాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలుకు ఆపరేషన్ చేయడం వల్ల రెండు మాసాలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు తెలిపారని బండి రామకృష్ణ తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబమని.వీరబాబు సంపాదన పై ఆధారపడిన కుటుంబం కావడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందారని మా వంతు సాయంగా రూ.10వేలు కుటుంబానికి అందజేశామని రామకృష్ణ తెలిపారు. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు మాట్లాడుతూ గాయాల పాలైన వీరబాబుని పరామర్శించి రూ.10వేలు ఆర్థిక సహాయం అందించటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సమీర్, డివిజన్ ఇన్చార్జిలు మహమ్మద్ దాదా, కర్రీ మహేష్, కూనపురెడ్డి ప్రసాద్,చక్రి,గణేష్,తోట రాజేష్ తదితరులు పాల్గొన్నారు.










