ప్రజాశక్తి - పాలకొండ రూరల్ : పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఎపి గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన గ్రీన్ అంబాసిడర్ల సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ క్లాస్ మిత్ర కార్మికులకు 6 నెలల నుండి రెండేళ్ల వరకు వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారన ా్నరు. అతి తక్కువ వేతన జీవులైన పంచాయతీ కార్మిక వేతనాలను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటే ఎలా జీవించాలి, ఏ విధంగా విధులు నిర్వహించాలో ప్రభుత్వ పెద్దలే తెలపాలన్నారు. పంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఈనెల 28న మండల కేంద్రాల్లో దీక్షలు నిర్వహించాలని యూనియన్ పిలుపు నిచ్చింది. ఈ కార్యక్రమంలో కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలపాలన్నారు.
సమావేశంలో ఎన్.గురువులు, బి.రవి, సిహెచ్ శంకర్రావు, జి.దుర్గారావు, ఎ.కూర్మారావు, బి. ఆనందరావు, ఎస్.సూర్యనారాయణ, కె.రాము, కె.శ్రీను, బి.వెంకయ్య, ఆర్.సత్యం, బి.దాసు తదితరులు పాల్గొన్నారు.










