గాండ్లపెంట : తమ బకాయి వేతనాలు చెల్లించాలని మండల పరిధిలోని సోమవారం కురమామిడి గ్రామ సచివాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు సచివాలయానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులు ఎం. రామానుజులు, ఎం. శ్రీరాములు మాట్లాడుతూ. గత ఏడాది నుంచి వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తమ సమస్యను పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ కష్టాలను తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో సచివాలయానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో యాదవేంద్ర కార్మికుల వద్దకు వెళ్లి చర్చించారు. మూడు నెలలు వేతనాలు తక్షణం మంజూరు చేస్తున్నామని పెండింగ్‌లో ఉన్న వేతనాలు కూడా త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించారు.










