పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది
ప్రజాశక్తి-యర్రగొండపాలెం : మండల పరిధిలోని బిళ్లగొంది పెంట గ్రామంలో వెంకటాద్రిపాలెం ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ కోటా నాయక్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్వర పీడితులకు రక్త పరీక్షలు చేశారు. సాధారణ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వాతావరణంలో మార్పుల కారణంగాబ వాంతులు, విరేచనాలు, విష జ్వరాలు ప్రభలే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. దోమ తెరలను వినియోగించ ుకోవాలన్నారు. ఈ కార్యక్ర మంలో వైద్య సిబ్బంది పిల్లి ఆవులయ్య, నలగాటి వెంకట్రామయ్య నాయుడు, లక్ష్మిదేవి, శ్రావణి పాల్గొన్నారు.










