న్యూయార్క్ : బిల్ గేట్స్‌తో తనకు వివాహేతర సంబంధం వుందని మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ వెల్లడించిన అంశంపై 2019 చివరిలో మైక్రోసాఫ్ట్ సంస్థ దర్యాప్తు చేపట్టింది. ఇందుకోసం బయటి న్యాయ విచారణ సంస్థను కూడా నియమించిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. దర్యాప్తు సమయంలో గేట్స్ బోర్డులో వుండడం సముచితం కాదని కొంతమంది బోర్డు సభ్యులు నిర్ణయించడంతో ఆయన 2020 మార్చిలో రాజీనామా చేశారు. అప్పటికి ఇంకా దర్యాప్తు ముగియలేదు. ఉద్యోగితో వున్న సంబంధానికి, బోర్డు నుండి వైదొలగానికి సంబంధం లేదని గేట్స్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.










